తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
- జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రతా చర్యలు
తొట్టంబేడు, తిరుపతి జిల్లా | ఎన్ టుడే న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు మండలంలో ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఎన్నికల నిబంధనలు అమలయ్యేలా సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.