BREAKING
thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
Date of Publish : 22 October 2026, 06:38 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి: యక్కంటి శ్రీనివాసరెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
22 Oct, 2026 - 06:38 PM
13 వీక్షణలు
  • కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి సవాల్
  • వర్షాన్ని లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన

హనుమంతునిపాడు | ఎన్ టుడే న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, ప్రజా తీర్పు ద్వారా ఎవరి బలం ఏమిటో తేల్చుకుందామని హనుమంతునిపాడు మండల వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి యక్కంటి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అధికారమే శాశ్వతమని భావించవద్దని, ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి

ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని యక్కంటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

వర్షంలోనూ నిరసన

ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నెలకొన్న పరిణామాలను నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యక్కంటి శ్రీనివాసరెడ్డి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగడం అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.