రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
మినీ వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి
చిట్యాల (ఎన్ టుడే న్యూస్): నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల–ఆరెగూడెం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాలకు చెందిన ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి చెందారు.
పని ముగించుకుని బైక్పై ఆరెగూడెం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మినీ వ్యాన్ ఆయన బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గౌస్ పాషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.