స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఏలూరు జిల్లా ఎస్పీ సమీక్ష
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి: ఏలూరు జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్‌బీ సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు, చింతలపూడి సీఐ క్రాంతి కుమార్, ఎస్‌ఐ సతీష్ కుమార్ పాల్గొన్నారు.