ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి: మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న సందర్శించి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న తీరును, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.