BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 17 October 2026, 03:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత.. ఎస్‌ఈసీ అనిలచంద్ర పునేఠా హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Oct, 2026 - 03:12 PM
0 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అధికారి అనిలచంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్లకు తగిన సూచనలు జారీ చేసి, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటే పరిస్థితులకు అనుగుణంగా అదనపు పోలీసు బలగాలను మోహరిస్తామని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో కలిపి గరిష్ఠంగా ముగ్గురికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఎస్‌ఈసీ సూచించారు.