ఎన్టీఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వాసం మునియ్య
టీడీపీలో రెండు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్నా.. పార్టీ అవకాశం కల్పిస్తుందని ఆశాభావం
ఎన్టీఆర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వాసం మునియ్య తెలియజేశారు. 2005 నుంచి టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేశానని, తన రాజకీయ అనుభవాన్ని, పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎన్టీఆర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు వాసం మునియ్య తెలియజేశారు.
2006లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏ.కొండూరు జెడ్పీటీసీ స్థానం నుంచి తన సతీమణి వాసం యశోద విజయం సాధించారని తెలిపారు. 2008 నుంచి 2010 వరకు కృష్ణా జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శిగా, 2010 నుంచి 2012 వరకు కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా, 2012 నుంచి 2014 వరకు ఏ.కొండూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించినట్లు వివరించారు.
2013లో పోలిశెట్టిపాడు గ్రామం నుంచి తన సతీమణి వాసం యశోద సర్పంచ్‌గా గెలుపొందగా, అదే ఏడాది వల్లంపట్ల గ్రామం నుంచి జనరల్ స్థానం ఎంపీటీసీగా తాను విజయం సాధించినట్లు తెలిపారు. అనంతరం ఏ.కొండూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికై, రాష్ట్ర ఎంపీపీల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైనట్లు పేర్కొన్నారు.
2014లో నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా వీరులపాడు మండల పరిశీలకుడిగా పనిచేసినట్లు తెలిపారు. 2014 నుంచి 2022 ఏప్రిల్ వరకు కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, 2018–2019 మధ్య గన్నవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా, 2021లో నందిగామ నియోజకవర్గ పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహించినట్లు వివరించారు. 2020 నుంచి 2025 వరకు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్లు తెలిపారు. 2008లో యూనిట్ ఇన్‌చార్జిగా, 2010లో క్లస్టర్ ఇన్‌చార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష పార్టీలను కలుపుకొని కిడ్నీ బాధితుల సమస్యలపై మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు వాసం మునియ్య తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమ మైనింగ్, ఇసుక తరలింపు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసినట్లు వివరించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వాసం మునియ్య, టీడీపీలో సుదీర్ఘకాలంగా నిర్వహించిన బాధ్యతలు, పార్టీ కోసం చేసిన సేవలు, ప్రజా సమస్యలపై సాగించిన పోరాటాన్ని పరిగణనలోకి తీసుకొని ఎన్టీఆర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.