BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 17 October 2026, 05:55 pm
Posted by : SEETHA KIRAN KUMAR

దసరా సెలవులకు ఇంటికొచ్చి.. గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

తెలంగాణ
/ ఖమ్మం
17 Oct, 2026 - 05:55 PM
8 వీక్షణలు

తల్లిదండ్రుల కళ్లెదుటే కుప్పకూలిన కుమారుడు.. ఖమ్మం జిల్లా వైరాలో విషాదం

వైరా: దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. తల్లిదండ్రుల ముందే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో చోటుచేసుకుంది.

గండగలపాడుకు చెందిన పదో వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతులకు కుమార్తె కీర్తి, కుమారుడు రాఘవ ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో రాఘవ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.

ఉదయం ద్విచక్రవాహనంపై దుస్తులు విక్రయించే వ్యక్తి వారి ఇంటి వద్దకు వచ్చాడు. తల్లి దుస్తులు చూస్తుండగా, మంచంపై కూర్చున్న రాఘవ “నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి” అంటూ తండ్రితో మాట్లాడాడు. ఇంతలోనే ఒక్కసారిగా కింద పడిపోయాడు.

దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రాఘవకు సీపీఆర్ చేసి, ఆటోలో వైరాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

దసరా సెలవులకు సంతోషంగా ఇంటికి వచ్చిన కుమారుడు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన గండగలపాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.