BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 21 July 2026, 07:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎస్సీ మహిళలకు ఇజ్రాయెల్‌లో ఉద్యోగావకాశం.. నెలకు రూ.1.99 లక్షల వేతనం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:42 AM
137 వీక్షణలు

ఎస్సీ మహిళలకు ఇజ్రాయెల్‌లో ఉద్యోగావకాశం.. నెలకు రూ.1.99 లక్షల వేతనం

గుంటూరు: నర్సింగ్ విద్య పూర్తి చేసిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మహిళలకు ఇజ్రాయెల్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి. దుర్గాభాయి వెల్లడించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) సమన్వయంతో ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.

ఇజ్రాయెల్‌లో హోం బేస్డ్ కేర్ గివర్ విభాగంలో మొత్తం 3,500 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

దరఖాస్తుదారులు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అయి ఉండాలి. కనీసం 1.5 మీటర్ల ఎత్తు, 45 కిలోల బరువు, పదో తరగతి ఉత్తీర్ణత, అలాగే ఇంటర్మీడియట్ స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం (సీఈఎఫ్‌ఆర్–బి2 స్థాయి) ఉండాలని తెలిపారు.

అదేవిధంగా, సంరక్షణ సేవల్లో అనుభవంతో పాటు సంబంధిత భారతీయ సంస్థల గుర్తింపు పొందిన 990 గంటల శిక్షణా కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా నర్సింగ్, ఫిజియోథెరపీ, నర్స్ అసిస్టెంట్ లేదా మిడ్‌వైఫరీలో డిప్లొమా అర్హత ఉండాలి. జీడీఏ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

అభ్యర్థుల పాస్‌పోర్ట్ కనీసం మూడు సంవత్సరాల చెల్లుబాటు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,99,700 వేతనం అందుతుందని తెలిపారు. తుది ఎంపిక, తిరస్కరణ నిర్ణయాలు ఇజ్రాయెల్ యాజమాన్యం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు కార్యనిర్వాహణాధికారి కె. వాణి – 9705623027ను సంప్రదించాలని సూచించారు.