అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి
ఉరుమడ్ల (ఎన్ టుడే న్యూస్): నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని పల్లపు బుద్ధుడు పేర్కొన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవడం అవసరమని తెలిపారు. ప్రతి అర్హుడు నమోదు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వామి కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీను, ఉయ్యాల మల్లేష్, గంగాపురం వెంకటేష్, ఎం.డి. జాంగిర్, ఎం.డి. కాజా, బెలిజ అరుణ్ కుమార్, కొండ శ్రీను, రూపాని రవి, బెలిజ మహేష్, గుంటోజు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.