BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 10:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆదిలాబాద్‌లో రూ.20 లక్షల విలువైన పేలుడు పదార్థాలు పట్టివేత.. ఏడుగురి అరెస్ట్

తెలంగాణ
/ ఆదిలాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Oct, 2026 - 10:13 PM
7 వీక్షణలు

ఆదిలాబాద్‌లో రూ.20 లక్షల విలువైన పేలుడు పదార్థాలు పట్టివేత.. ఏడుగురి అరెస్ట్

 ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పిరివాడ టోల్‌ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీల సందర్భంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 20,000 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లను స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ నుంచి పేలుడు పదార్థాలను తీసుకొచ్చి గనులు, క్వారీలతో పాటు స్టోన్ క్రషర్లకు అధిక ధరలకు విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల విలువ రూ.19.15 లక్షలు కాగా, వాహనాలతో కలిపి మొత్తం సీజ్ విలువ సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు.

నిందితుల నుంచి ఒక బొలెరో, ఒక హోండా సిటీ కారు, ఆరు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవికుమార్ ద్వారా పేలుడు పదార్థాలను సేకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఇతరుల పేర్లతో ఉత్తరప్రదేశ్‌లోని ఓ కంపెనీ నుంచి బిల్లులు తీసుకుని, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను బూస్టర్ బాక్సుల్లో దాచి తెలంగాణకు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు వాహనాల్లో పేలుడు పదార్థాలను తీసుకొస్తుండగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మరో ఇద్దరైన ఎం.డి. వాహిద్, రవికుమార్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు పదార్థాల అసలు మూలం, ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. సరైన లైసెన్సులు, అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తరలించినా, నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.