BREAKING
thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన
Date of Publish : 22 October 2026, 06:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కుటుంబ వివాదం.. మరిది కొరికాడని వదిన ఫిర్యాదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Oct, 2026 - 06:16 PM
9 వీక్షణలు

ఫిలింనగర్‌లో పరస్పర ఫిర్యాదులు.. కేసులు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని ఫిలింనగర్‌లో కుటుంబ వివాదం నేపథ్యంలో వదిన, మరిది పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. తన మరిది సురేశ్ కుమార్ చేతులు, కాళ్లపై కొరికాడని సౌమ్య ఫిర్యాదు చేయగా, తనపై వదిన దాడి చేసిందని సురేశ్ కుమార్ కూడా పోలీసులను ఆశ్రయించాడు. ఇరువురి ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫిలింనగర్‌లో విజయ్ కుమార్, ఆయన భార్య సౌమ్య నివాసం ఉంటున్నారు. తన భర్త ఉద్యోగం చేయకుండా, తన బంగారు ఆభరణాలను తీసుకున్నాడని సౌమ్య ఆరోపించింది. అంతేకాకుండా ఆస్తి పత్రాలను తీసుకోవడంతో పాటు తన పేరుపై రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో అక్టోబర్‌ 20న ఇంట్లో కుటుంబ వివాదం చోటుచేసుకున్నట్లు సౌమ్య తెలిపింది. ఆ సమయంలో మరిది సురేశ్ కుమార్ తన చేతులు, కాళ్లపై కొరికాడని, చంపుతానని బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

మరోవైపు, కుటుంబ వివాదం సమయంలో తనపై వదిన సౌమ్య దాడి చేసిందని సురేశ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.