BREAKING
thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
Date of Publish : 22 October 2026, 08:13 pm
Posted by : KOLA MAHESH

ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
22 Oct, 2026 - 08:13 PM
11 వీక్షణలు

తక్కువ నీటితో సాగు చేసే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి: అధికారులు

వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా | అక్టోబర్ 22 | ఎన్ టుడే న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అక్కంపల్లి గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పులు, వర్షపాతం తగ్గే అవకాశాలు, వ్యవసాయంపై వాటి ప్రభావాల గురించి అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి. శ్రీనివాస్, ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై దృష్టి సారించాలని సూచించారు.

నీటి వినియోగంలో పొదుపు అవసరం

తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. పంట నష్టాలను తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు.

గ్రామసభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశిరెడ్డి వేణుగోపాల్, ఉప సర్పంచ్ నిమ్మల కృష్ణ, వార్డు సభ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారి స్వప్న, పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.