BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 16 October 2026, 11:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో కొంతమంది సచివాలయ సర్వేయర్ల ధోరణి తో రైతులకు ఇక్కట్లు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Oct, 2026 - 11:16 PM
12 వీక్షణలు

చాట్రాయి మండలంలో కొంతమంది సచివాలయ సర్వేయర్ల ధోరణి తో రైతులకు ఇక్కట్లు అందుబాటులో వుండరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయని దుస్థితి 

చాట్రాయిలో సర్వేయర్‌ కొరత.. రైతులకు తప్పని తిప్పలు!

ఇన్‌చార్జి సర్వేయర్‌ అందుబాటులో లేరని ప్రజల ఆవేదన.. ఫోన్‌ చేసినా స్పందన కరువు

రీ సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారా? విధుల నిర్వహణపై విచారణ జరపాలని రైతుల డిమాండ్‌

ఏలూరు జిల్లా / నూజివీడు నియోజకవర్గం / చాట్రాయి మండలం: మండలంలో రెగ్యులర్‌ సర్వేయర్‌ లేకపోవడంతో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వచ్చే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన సర్వే విభాగానికి సంబంధించిన పనులు సకాలంలో జరగకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. చాట్రాయి మండల సర్వేయర్‌ బాధ్యతలను చింతలపూడి మండల సర్వేయర్‌కు అప్పగించినప్పటికీ, ఆయన మండలానికి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.

భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, ఇతర భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మండల సర్వేయర్‌ అందుబాటులో లేకపోవడంతో సచివాలయ సర్వేయర్లపై ఆధారపడాల్సి వస్తోందని, అయినప్పటికీ తమ అవసరాలు సకాలంలో నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా సర్వే చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలో, తమ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

మండలంలోని సచివాలయాల సర్వేయర్ లు కొంత మంది నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని ఫోన్ చేసినా లేపరని, లేపినా నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని

సరైన సమాధానం లభించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు కలవాలి, ఎక్కడ అందుబాటులో ఉంటారనే విషయాలపై కూడా స్పష్టత ఉండటం లేదని వాపోతున్నారు. గతంలో సంప్రదించినప్పుడు చాట్రాయి మండలంలో రీ సర్వే పనులు జరుగుతున్నాయని చెప్పేవారని, ప్రస్తుతం చింతలపూడి మండలం పరిధిలోని రాఘవాపురం గ్రామంలో రీ సర్వే విధుల్లో ఉన్నామని చెబుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే రీ సర్వే పనులు కొనసాగుతున్నప్పటికీ, సాధారణ ప్రజల భూ సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది.

మండలంలోని సచివాలయ సర్వేయర్లు సైతం రీ సర్వే విధుల్లోనే ఉంటే, సాధారణ భూ సర్వే అవసరాలతో వచ్చే రైతులకు సేవలు అందించేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రీ సర్వే ముఖ్యమైన ప్రక్రియ అయినప్పటికీ, దాని కారణంగా ఇతర ప్రజా సేవలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాకూడదని అభిప్రాయపడుతున్నారు. సర్వే పనుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తే రైతులకు సమయం, డబ్బు వృథా కావడంతో పాటు ఇతర భూ లావాదేవీలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో చాట్రాయి మండలంలో పనిచేసిన మండల సర్వేయర్ గానీ, సచివాలయ సర్వేయర్లు గానీ రీ సర్వే పనులు కొనసాగుతున్న సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలను పరిష్కరించేవారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. వారు బదిలీపై ఇతర మండలాలకు వెళ్లిన తర్వాత పరిస్థితులు మారాయని, ఇబ్బందులు తలెత్తుతాయని ఇతర మండలాల నుంచి బదిలీలపై వచ్చి బాధ్యతలు నిర్వహిస్తున్న సచివాలయ సర్వేయర్లు  అందుబాటులో లేకపోవడం, కొందరు ఫోన్ లు లిఫ్ట్ చేయక పోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని ఆరోపిస్తున్నారు.

అసలు చాట్రాయి మండలంలో సర్వేయర్‌ సేవల విషయంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ ప్రజలకు సేవలు అందకపోవడానికి కారణాలేమిటి? విధుల కేటాయింపులో లోపాలున్నాయా? ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. భూములకు సంబంధించిన పనులు అత్యంత కీలకమైనవి కావడంతో సర్వేయర్‌ అందుబాటులో లేకపోవడం రైతులకు మరింత భారంగా మారుతోందని ప్రజలు పేర్కొంటున్నారు.

ఈ సమస్యపై చాట్రాయి తహశీల్దార్‌ తక్షణమే స్పందించి, ఇన్‌చార్జి సర్వేయర్‌ విధుల నిర్వహణ, సచివాలయ సర్వేయర్లకు కేటాయించిన పనులు, కొంత మంది సచివాలయ సర్వేయర్ల నిర్లక్ష్య ధోరణి.  ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు. మండలానికి సర్వేయర్‌ సేవలు అందుబాటులో ఉండేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని, ఫోన్‌ ద్వారా అయినా ప్రజలకు సమాచారం ఇచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే రైతులు, సామాన్య ప్రజల ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది సచివాలయ సర్వేయర్ లు మరీ దారుణంగా రైతులను హీనంగా చూస్తున్నారని, చులకన భావంతో చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వారిని గుర్తించి వారిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇంకా వారిలో మార్పు రాకపోతే జిల్లా కలెక్టర్ కు వారిపై ఫిర్యాదు చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు