BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అనుములంకలో రైతుల మోటార్ల వైర్లు కట్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:13 PM
20 వీక్షణలు

పంట కాల్వలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుములంక గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రైతుల వ్యవసాయ మోటార్ల వైర్లను కట్ చేసి, సమీపంలోని పంట కాల్వలో పడేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతులు గొల్లమందల వెంకటేష్, గొల్లమందల రవికి చెందిన పొలాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పంటలకు నీరు అందించేందుకు ఉపయోగించే వ్యవసాయ మోటార్ల వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కట్ చేసి ధ్వంసం చేయడంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు ఈ ఘటన ఇబ్బందికరంగా మారింది. మోటార్ల వైర్లు ధ్వంసం కావడంతో పంటలకు నీరు అందించే విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.