BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 07:59 pm
Posted by : PABBINEEDI B SANKAR

రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
15 Oct, 2026 - 07:59 PM
9 వీక్షణలు

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ధర్నా

సంగారెడ్డి (ఎన్ టుడే న్యూస్): రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిర్ణీత సమయాల్లో నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో ధర్నా నిర్వహించారు.

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని ఐబీ భవనం నుంచి సదరన్ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈడీ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ను నిర్ణీత సమయాల్లో నిరంతరాయంగా అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వపురం లక్ష్మన్న, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేపాల్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కిసాన్ మోర్చా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.