BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 10:55 pm
Posted by : KOLA MAHESH

ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
23 Oct, 2026 - 10:55 PM
18 వీక్షణలు

తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలి: ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి

వలిగొండ, అక్టోబర్ 23 (ఎన్‌ టుడే న్యూస్‌): ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వలిగొండ మండల పంచాయతీ అభివృద్ధి అధికారి జి. జలంధర్ రెడ్డి సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో సర్పంచ్ రాపోలు గోపి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని, భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని ఎంపీడీవో సూచించారు. నీటిని వృథా చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, పంటల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. సాగునీటిని అవసరమైన మేరకే వినియోగిస్తూ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

ఈ గ్రామసభలో ఏపీఓ, వ్యవసాయ శాఖ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈ, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి జోక్ అపర్ణ, రైతులు పాల్గొన్నారు.

అనంతరం ఎదుళ్లగూడెం గ్రామంలో సర్పంచ్ కొంతం శ్రీను అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు కూడా ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి పొదుపు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.