BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 15 October 2026, 11:49 am
Posted by : SIVA RAJ

గుంటూరులో ఘోర ప్రమాదం ....

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
15 Oct, 2026 - 11:49 AM
2 వీక్షణలు

30 మీటర్ల ఎత్తు నుంచి పడి ఇద్దరు కార్మికులు మృతి

గ్రీన్ గ్రాస్ బహుళ అంతస్తుల భవనంలో ఘటన.. పోలీసుల దర్యాప్తు

గుంటూరు: గుంటూరు పట్టణ పరిధిలోని గ్రీన్ గ్రాస్ బహుళ అంతస్తుల భవనంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మృతులను సంతోష్ ప్రధాన్ (29), శివ (22)గా గుర్తించినట్లు సమాచారం. లిఫ్ట్ క్రేన్‌కు సంబంధించిన ఫిట్టింగ్ సరిగా లేకపోవడంతో వారు సుమారు 30 మీటర్ల ఎత్తు నుంచి కిందపడినట్లు ప్రాథమిక కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో భవన నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.