BREAKING
thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 09:59 am
Posted by : SEETHA KIRAN KUMAR

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 09:59 AM
32 వీక్షణలు
  • రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ అంబులెన్స్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా విషాదం
  • రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ ఢీ
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు..

నిర్మల్ జిల్లా | ఎన్ టుడే న్యూస్: కూతురికి మెరుగైన వైద్యం అందించేందుకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. నిర్మల్ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అందిన సమాచారం ప్రకారం, రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ అంబులెన్స్‌ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

మృతులను ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడకు చెందిన మెస్రం పారుబాయి (55), ఆమె కుమార్తె మెస్రం సరస్వతి (22)గా గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సరస్వతి ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కూతురికి మెరుగైన వైద్యం అందించాలనే ఆశతో బయలుదేరిన తల్లి, కుమార్తె ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.