దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
ఉరుమడ్ల లారీ, బోరింగ్ డ్రిల్లర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సహాయం
చిట్యాల: మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన దివంగత జన్నపాల లింగస్వామి కుటుంబానికి ఉరుమడ్ల లారీ అసోసియేషన్, బోరింగ్ డ్రిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం మానవత్వానికి నిదర్శనమని తెలిపారు. సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, అవసరంలో ఉన్నవారికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సాగర్ల గంగరాజు, చెరుకు సైదులు, జన్నపాల మురళి, రూపని శ్రీశైలం, రూపని వెంకన్న, కంబాలపల్లి లింగస్వామి, జన్నపాల రాజు, జన్నపాల స్వామి, జన్నపాల చరణ్ తదితరులు పాల్గొన్నారు.