మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం
ఉరుమడ్లకు చెందిన జనపాల లింగస్వామి కుటుంబానికి అండగా ఆఫ్రికా డ్రిల్లింగ్ అసోసియేషన్ సభ్యులు
ఉరుమడ్ల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన జనపాల లింగస్వామి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆఫ్రికా డ్రిల్లింగ్ అసోసియేషన్, సహచర బోరింగ్ రిగ్ డ్రిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. అసోసియేషన్ తరఫున లింగస్వామి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
కుటుంబం కష్టకాలంలో ఉన్న సమయంలో తోటి డ్రిల్లింగ్ రంగం సభ్యులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించడం పట్ల మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ బాధలో పాలుపంచుకుని అండగా నిలిచిన అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కురుపాటి లింగయ్యతో పాటు నగేష్, శ్రీను, ఇతర గ్రూప్ సభ్యులు పాల్గొని ఆర్థిక సహాయం అందజేశారు.