BREAKING
thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం
Date of Publish : 23 October 2026, 12:23 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ అభివృద్ధికి రూ.382 కోట్లతో ఐదు కీలక ప్రాజెక్టులు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 12:23 PM
14 వీక్షణలు

వరంగల్ (ఎన్‌ టుడే న్యూస్‌): చారిత్రక వరంగల్ మహానగర రూపురేఖలను మార్చే లక్ష్యంతో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) పరిధిలో ఐదు కీలక ప్రాజెక్టులకు రూ.382 కోట్ల నిధులు కేటాయించినట్లు సమాచారం. ప్రపంచ బ్యాంకు రుణ సహకారంతో చేపట్టనున్నట్లు పేర్కొంటున్న ఈ ప్రాజెక్టులు అమలైతే నగరంలో పర్యాటక, రవాణా, వినోద సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టులకు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి:

- ఖిలా వరంగల్ కోటలో మోట్ అభివృద్ధి: రూ.209 కోట్లు

- ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్: రూ.125 కోట్లు

- వేయిస్తంభాల ఆలయ అభివృద్ధి: రూ.20 కోట్లు

- సెంట్రల్ ప్లాజా: రూ.19 కోట్లు

- మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి: రూ.9 కోట్లు

ఈ ఐదు ప్రాజెక్టులకు కలిపి రూ.382 కోట్ల కేటాయింపులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాకతీయుల చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖిలా వరంగల్ కోట అభివృద్ధికి అత్యధికంగా రూ.209 కోట్లు ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వేయిస్తంభాల ఆలయం, మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధితో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు ఆధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావచ్చు.

ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే వరంగల్ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పర్యాటక రంగానికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టుల అమలు, పనుల ప్రారంభం, నిధుల విడుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.