BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 07 February 2026, 09:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రైవేట్ పాఠశాలలకూ FLS సన్నద్ధత

తెలంగాణ
07 Feb, 2026 - 09:14 AM
190 వీక్షణలు
ప్రైవేట్ పాఠశాలలకూ FLS సన్నద్ధత Foundational Learning Study అమలుపై కలెక్టర్ పమేలా సత్పతి అవగాహన సమావేశం NTODAY NEWS: కరీంనగర్  జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రైవేట్ పాఠశాలల హెడ్‌మాస్టర్లు, కారస్పాండెంట్లకు Foundational Learning Study (FLS) అమలుపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, FLS మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు రాండమైజేషన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ఏ పాఠశాలైనా ఎంపికయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రైవేట్ పాఠశాలలను కూడా FLS‌కు పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇంగ్లీష్, గణిత విభాగాలకు సంబంధించిన FLS మోడల్ టెస్ట్ పేపర్లు, వాటి నిర్మాణం, విద్యార్థుల సన్నద్ధతపై తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ వివరించారు. మూడో తరగతి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు SCERT రూపొందించిన FLS మాక్ టెస్ట్ పేపర్లు, ఐటమ్ బ్యాంక్‌పై జూమ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మండల విద్యాధికారులు ఈ అంశంపై తరచుగా సమీక్షలు నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలకు మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహించి పరీక్షా విధానానికి అలవాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే రెండు మాక్ టెస్టులు నిర్వహించి విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే, కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. #FoundationalLearningStudy #FLS #EducationReforms #PrivateSchools #SchoolEducation #StudentAssessment #LearningOutcomes #DistrictAdministration Follow us on Website Facebook Instagram YouTube