సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం
మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం వై. వెంకటేశ్వర్లు ధర్మపత్ని ధనలక్ష్మి, కనపర్తి గగన్ నిషిత్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గగన్ నిషిత్ నాయనమ్మ స్వరాజ్యం కుమారులు రాధాకృష్ణ, కాసులు సహకారంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని సమితి నిర్వాహకులు ప్రారంభించారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. దాతల సహకారంతో ప్రతి ఆదివారం అన్నదానం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సత్యసాయి సేవా సమితి సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో చీకటి నాగేశ్వరరావు, కోన లక్ష్మీమోహన్‌రావు, కపిలవాయి జగన్మోహన్‌రావు, మనం ఆర్సీ ఇన్‌చార్జి పార్శపు అరుణ్, పసుమర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.