ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
ఆళ్లగడ్డ (ఎన్ టుడే న్యూస్): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు కనిపించడం లేదంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆళ్లగడ్డలోని విద్యానగర్‌కు చెందిన అశోక్‌తో పాటు మరో వ్యక్తి కిడ్నాప్‌కు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నాకు దిగడంతో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడానికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.