కనిగిరి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల సమక్షంలో టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలోకి 5 కుటుంబాల చేరిక
YSRCP పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారి సమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి మండలం, నేలటూరు గొల్లపల్లి గ్రామానికి చెందిన 5 కుటుంబాల నాయకులు ముండ్లపాటి బాలరాజు, పెరికే వెలుగొండయ్య, కుంచం నాని, కుంచం ఏసు, అమ్మనబ్రోలు చిన్న అంజయ్య తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీ చేరారు. ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ గారు వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా వైయస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు.సమిష్టిగా పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు వాకమల్ల రాజశేఖర్ రెడ్డి మరియు గ్రామ పార్టీ నాయకులు బీరం మల్లికార్జున రెడ్డి, సిద్దపురెడ్డి వెంకట నరసారెడ్డి, ముళ్లపాటి అబ్రహం, పెరికే దాసు, ముళ్లపాటి ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు...