ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
- ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల స్థానాలకు పత్రాల సమర్పణ
ఆళ్లగడ్డ | ఎన్ టుడే న్యూస్: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.
ఆళ్లగడ్డ జడ్పీటీసీ స్థానాలకు ఇరిగెల సూర్యనారాయణరెడ్డి, ఇరిగెల జయేంద్రరెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. చాగలమర్రి జడ్పీటీసీ స్థానానికి కోత మోహన్‌రెడ్డి, శిరివెళ్ల జడ్పీటీసీ స్థానానికి పెసరాయి చంద్ బాషా నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థుల వెంట ఇరిగెల రామచంద్రారెడ్డి ఉన్నారు.