నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలి: సంస్థ సంచాలకులు సియాజి రాయి
నల్గొండ (ఎన్ టుడే న్యూస్): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకులు సియాజి రాయి తెలిపారు.
శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నల్గొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 31లోపు సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సదుపాయాలు అందిస్తున్నందున అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ సంచాలకులు సూచించారు.