BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 10:31 pm
Posted by : PAGADALA DEVAIAH

ఎల్బీనగర్‌లో పెండింగ్ యూజీడీ పనులకు నిధులు మంజూరు చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
15 Oct, 2026 - 10:31 PM
16 వీక్షణలు

ఎల్బీనగర్‌లో పెండింగ్ యూజీడీ పనులకు నిధులు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఈడీ పంకజను కలిసిన ఎమ్మెల్యే

పలు కాలనీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి వినతి

ఇప్పటికే కొన్ని పనులు మంజూరు చేశాం.. మిగతావి పూర్తి చేస్తాం: ఈడీ

ఎల్బీనగర్, అక్టోబర్ 15 (ఎన్ టుడే న్యూస్): ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, అవసరమైన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మల్కాజిగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను కలిసి వినతిపత్రం అందజేశారు.

పలు కాలనీల్లో డ్రైనేజీ పనులకు వినతి

నియోజకవర్గ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను త్వరితగతిన మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. బైరామల్‌గూడలోని గోకుల్ ఎన్‌క్లేవ్, హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సిరిహిల్స్, శ్రీ గాయత్రి నగర్, దత్తాత్రేయ నగర్, కుంట్లూరు రోడ్డులోని బెల్లయాదవ్ నగర్, బాగ్ హయత్‌నగర్‌లోని సాయిరాం నగర్, శ్రీ వినాయక నగర్, శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీల్లో యూజీడీ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

హస్తినాపురం డివిజన్ పరిధిలోని డైమండ్ కాలనీ, సుల్తాన్ వాల్వ వీకర్ సెక్షన్, శ్రీ వెంకటేశ్వర కాలనీ, వెంకటేశ్వర కాలనీ ఫేజ్-2, హస్తినాపురం రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిధి, ఖాద్రి కాలనీల్లో డ్రైనేజీ పనులు మంజూరు చేయాలని కోరారు.

మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సి.ఎస్.ఆర్. కాలనీ, సి.ఆర్. ఎన్‌క్లేవ్, జడ్జెస్ కాలనీ ఫేజ్-1, శ్రీరామ్ నగర్ కాలనీల్లోనూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇతర డివిజన్లలోనూ పనులు చేపట్టాలని విజ్ఞప్తి

బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బి.ఎన్. రెడ్డి నగర్, శ్రీపురం డెవలప్‌మెంట్ అసోసియేషన్ పరిధి, చైతన్యపురి డివిజన్‌లోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ, వనస్థలిపురంలోని శారద నగర్ కాలనీ, కొత్తపేట డివిజన్‌లోని గణేష్ నగర్, సత్య నగర్, రాజీవ్ గాంధీ కాలనీల్లో డ్రైనేజీ పనులకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.

అలాగే నాగోల్ డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీ, గడ్డిఅన్నారం డివిజన్‌లోని తిరుమల నగర్ కాలనీలోనూ యూజీడీ పనులు చేపట్టాలని కోరారు.

కొన్ని పనులకు ఇప్పటికే అనుమతులు

ఎమ్మెల్యే అందించిన నివేదిక ప్రకారం కొన్ని పనులకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినట్లు ఈడీ పంకజ తెలిపారు. ప్రధాన సమస్యలు ఉన్న కాలనీల్లో డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన పనులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.