BREAKING
thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు
మంచి మాట
Date of Publish : 26 October 2026, 06:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా కావూరి శశిరేఖ ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 06:02 PM
14 వీక్షణలు

గతంలో జడ్పీటీసీగా పనిచేసిన అనుభవానికి ప్రాధాన్యం.. పార్టీ శ్రేణుల్లో హర్షం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కావూరి శశిరేఖ ఎంపికయ్యారు. గతంలో జడ్పీటీసీగా పనిచేసిన అనుభవంతో పాటు, ప్రజలకు సేవలందించడంలో ఆమెకున్న పరిచయాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కావూరి శశిరేఖ 2001 నుంచి 2006 వరకు గంపలగూడెం మండల జడ్పీటీసీగా పనిచేశారు. ఆ సమయంలో స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం నాలుగు సంవత్సరాల పాటు నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఆమె భర్త కావూరి వినయ్ కుమార్ సీనియర్ రాజకీయ నాయకుడిగా, ప్రస్తుతం గంపలగూడెం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత, స్థానికంగా ఉన్న పరిచయాలు కూడా శశిరేఖ ఎంపికకు ప్రాధాన్యతను చేకూర్చాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గతంలో జడ్పీటీసీగా పనిచేసిన అనుభవం, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న నాయకురాలికి అవకాశం కల్పించడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న పరిషత్ ఎన్నికల్లో కావూరి శశిరేఖ అభ్యర్థిత్వం మండల రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.