ఉరుమడ్లలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఉపాధ్యాయుల సేవలను కొనియాడిన గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం
చిట్యాల | Ntoday News
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం హాజరై ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వారిని భవిష్యత్ పౌరులుగా రూపొందించడంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. విద్యార్థుల జీవితాలను సరైన మార్గంలో నడిపించే ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, వెంకన్న, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్దన్, వార్డు సభ్యుడు ఎలిమినేటి హరిప్రసాద్‌రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.