గ్రీన్ ఫీల్డ్ హైవేగా వరంగల్–జగిత్యాల
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హన్మకొండ–కరీంనగర్ సెక్షన్ పనులు దాదాపు పూర్తి
వరంగల్ | Ntoday News
వరంగల్–జగిత్యాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ జాతీయ రహదారిలోని హన్మకొండ–కరీంనగర్ సెక్షన్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి.
కొత్తగా నిర్మిస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తయితే వరంగల్, హన్మకొండ నుంచి కరీంనగర్, జగిత్యాల వైపు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.
హైవే నిర్మాణం పూర్తయిన అనంతరం వరంగల్–జగిత్యాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుంది. దీంతో ఆయా ప్రాంతాల మధ్య వాణిజ్య, రవాణా కార్యకలాపాలకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది.