BREAKING
పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు: జీవో నెం.33ను తక్షణమే రద్దు చేయాలి కిడ్నీ మార్పిడిలను వ్యాపారంగా మార్చే ప్రమాదం ఉంది సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 09:39 PM
1 వీక్షణలు

తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ మార్పిడిలకు సంబంధించి జారీ చేసిన జీవో నెం.33ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో వీడియో ద్వారా ఆయన మాట్లాడారు.

గతంలో కిడ్నీ మార్పిడిల పేరుతో అనేక అక్రమ దందాలు జరిగిన విషయాన్ని నారాయణ గుర్తుచేశారు. కోట్లాది రూపాయల వ్యాపారం సాగడంతో పేద, సామాన్య ప్రజలు మోసపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కిడ్నీ మార్పిడిలో రక్త సంబంధీకులకు మాత్రమే అవకాశం ఉండేలా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

అయితే జీవో నెం.33 ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు కిడ్నీ మార్పిడిల విషయంలో మరింత అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని నారాయణ ఆరోపించారు. దీనివల్ల కార్పొరేట్ ఆసుపత్రులు కిడ్నీ మార్పిడిని పెద్ద ఎత్తున వ్యాపారంగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అవయవ మార్పిడి వంటి సున్నితమైన వైద్య విధానాల్లో వ్యాపార ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే పేద ప్రజలే తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ జీవో వల్ల సామాన్య ప్రజలకు ప్రయోజనం కలగకపోగా, కార్పొరేట్ వైద్య రంగానికి మాత్రమే మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శించారు.

రేపు జరగనున్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జీవో నెం.33కు ఆమోదం తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీవో నెం.33ను వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.