BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 04:55 pm
Posted by : DAVU RAVINDER REDDY

డంపింగ్ యార్డ్ వ్యర్థాలతో ఇబ్బందులు.. తరలించాలని స్థానికుల డిమాండ్

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
01 Sep, 2026 - 04:55 PM
54 వీక్షణలు

ఘట్కేసర్: ఘట్కేసర్ ఓఆర్‌ఆర్ టోల్ సమీపంలోని అన్నోజిగూడ సర్వీస్ రోడ్డు మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన కారణంగా స్థానికులు, ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యర్థాల కారణంగా పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ఏర్పడటంతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెత్త నుంచి వెలువడే దుర్వాసన, పొగ కారణంగా స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, కొందరికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సర్వీస్ రోడ్డుపై ప్రయాణించే సమయంలో దుర్వాసన తీవ్రంగా ఉంటోందని వాహనదారులు చెబుతున్నారు.

డంపింగ్ యార్డ్ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్తను మరో ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడటంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

డంపింగ్ యార్డ్ నిర్వహణపై అధికారులు పర్యవేక్షణ పెంచి, వ్యర్థాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.