BREAKING
thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 21 October 2026, 08:55 am
Posted by : NAGARAJU GADE

విజయనగరం కోటలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు విడిది

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
21 Oct, 2026 - 08:55 AM
21 వీక్షణలు
  • పైడితల్లమ్మ జాతర, దసరా ఉత్సవాల వేళ జిల్లాకు రాక

  • రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న కోటలో బస


విజయనగరం | ఎన్ టుడే న్యూస్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ జాతర, దసరా ఉత్సవాలతో విజయనగరం జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పండుగ వాతావరణం మధ్య చారిత్రాత్మక విజయనగరం కోట రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
గోవా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పూసపాటి అశోక్ గజపతిరాజు తన సొంత జిల్లాకు విచ్చేశారు. ప్రస్తుతం ఆయన విజయనగరం కోటలో విడిది చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున కీలక పాత్ర పోషించిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన కుమార్తె పూసపాటి అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఒకవైపు పైడితల్లమ్మ జాతర, దసరా ఉత్సవాలతో జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, మరోవైపు గవర్నర్ అశోక్ గజపతిరాజు కోటలో బస చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పర్యటన నేపథ్యంలో జిల్లాలోని రాజకీయ పరిణామాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా దృష్టి సారిస్తున్నాయి.