BREAKING
thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం
Date of Publish : 19 October 2026, 07:58 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చండీ రూపంలో దర్శనమిచ్చిన చౌడేశ్వరి అమ్మవారు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Oct, 2026 - 07:58 PM
7 వీక్షణలు

చదల్లాలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న వందలాది భక్తులు

పుంగనూరు: అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పరిధిలో ప్రసిద్ధి చెందిన చదల్లా గ్రామంలోని సప్తమాతృక సమేత చౌడేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ చండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగ్ర, మహోజ్వల రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు.

అమ్మవారిని స్మరించుకుంటే భయాలు తొలగిపోయి, తల్లి దయ ఉంటే విజయాలు కలుగుతాయనే విశ్వాసంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శ్రీ చండీ అమ్మవారి ప్రీత్యర్థం ప్రత్యేక హోమాలు చేపట్టారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి, ఉషశ్రీ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి.

చండీ రూపంలో దర్శనమిచ్చిన చౌడేశ్వరి అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు చదల్లా గ్రామస్తులు, ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

మంగళవారంతో ముగియనున్న ఉత్సవాలు

చౌడేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. చివరి రోజు అమ్మవారిని శ్రీ చౌడేశ్వరి అలంకరణలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని చదల్లా గ్రామంలో ఊరేగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.