రూ.23.50 లక్షల కరెన్సీ నోట్లతో దుర్గామాతకు ధనలక్ష్మి అలంకరణ
సిర్పూర్లో భక్తులను ఆకట్టుకున్న వినూత్న అలంకారం.. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
డొంకేశ్వర్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిర్పూర్ గ్రామంలో దుర్గామాత ఉత్సవ సమితి సేన ఆధ్వర్యంలో అమ్మవారికి అపూర్వ అలంకరణ చేశారు. భక్తుల సహకారంతో రూ.23.50 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో దుర్గామాతను ధనలక్ష్మి స్వరూపంలో తీర్చిదిద్దారు.
రూ.500, రూ.200, రూ.100 నోట్లతో రూపొందించిన వినూత్న హారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి అలంకరణను దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు యూత్ సేన సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.