BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 17 October 2026, 07:16 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

వైసీపీ కార్యకర్త హుస్సేనయ్య మృతికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంతాపం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
17 Oct, 2026 - 07:16 PM
7 వీక్షణలు

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే

రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం పర్యటించారు. గ్రామంలోని శివాలయం కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాధం హుస్సేనయ్య (37) పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం హుస్సేనయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కార్యకర్తగా హుస్సేనయ్య చేసిన సేవలు మరువలేనివని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మృతి వైఎస్సార్‌సీపీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరమని, ఈ కష్ట సమయంలో వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గెల్లి చినకోటిరెడ్డి, మాజీ డీలర్ గెల్లి కోటిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చపారపు సంజీవరెడ్డి, మేడికొండ వీరారెడ్డి, కల్లి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.