అమ్మవారి సేవలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
NTODAY NEWS : చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, ఓర్సు రాజ్కుమార్, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, నర్రా మోహన్రెడ్డి, అందె రాములు, జడల చిన్న మల్లయ్య, గాదెవోని కొండయ్య, ఏర్పుల నరసింహ, కురు యాదయ్య, ఆనగంటి నరేష్, నారాయణ రమేష్, నారాయణ మధుసూదన్, రాసమల్ల జానయ్య, అంశాల సత్యనారాయణ, కొత్త వెంకన్న, నీలకంఠం కిష్టయ్యతో పాటు పలువురు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.