వట్టిమర్తిలో దుర్గామాతను దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
భక్తులకు అన్నప్రసాదం పంపిణీ
నకిరేకల్ / చిట్యాల: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ
అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.