అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి
చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంశాల సత్తయ్య మృతి చెందడంతో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.