BREAKING
thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 08:13 pm
Posted by : KOLA MAHESH

సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
24 Oct, 2026 - 08:13 PM
25 వీక్షణలు

గ్రామదేవతల ఆలయాల్లో పూజారులుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌

సంస్థాన్‌ నారాయణపురం| ఎన్ టుడే న్యూస్‌: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కుమ్మర సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ సరళమైసమ్మ దేవాలయంతో పాటు గ్రామదేవతల ఆలయాల వద్ద స్థానిక కుమ్మర్లకు సంప్రదాయ హక్కులు కల్పించాలని సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

సంప్రదాయ సేవలకు గుర్తింపు ఇవ్వాలి

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామదేవతల ఆలయాల వద్ద తరతరాలుగా కొనసాగుతున్న కుమ్మర్ల సంప్రదాయ సేవలను గుర్తించాలని కోరారు. ఆయా ఆలయాల్లో పూజారులుగా తగిన గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ సంప్రదాయ హక్కులను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దాడి ఘటనపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి

అల్లాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కుమ్మర్లపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సంఘం నాయకులు తహసీల్దార్‌ను కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.


ఈ ధర్నాలో కుమ్మర సంఘం నాయకులు, కులపెద్దలు, స్థానిక కుమ్మర కులస్తులు పాల్గొన్నారు.