టీడీపీలో చేరిన గడ్డిముడిదాం గ్రామానికి చెందిన గుణుపూరు రామానాయుడు
ఆంధ్రప్రదేశ్
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన టీడీపీ నాయకులు
రాజాం, విజయనగరం జిల్లా | ఎన్ టుడే న్యూస్: రాజాం మండలం గడ్డిముడిదాం గ్రామానికి చెందిన గుణుపూరు రామానాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు రామానాయుడు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు.