BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 03:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పెళ్లి వద్దు.. పెళ్లి సందడి ముద్దు.. హైదరాబాద్‌లో ఫేక్ వెడ్డింగ్ క్రేజ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Sep, 2026 - 03:13 PM
15 వీక్షణలు

వధూవరులు లేకుండానే బారాత్, సంగీత్, మెహందీ.. యువతలో కొత్త ట్రెండ్

హైదరాబాద్ | Ntoday News

పెళ్లి చేసుకోవాలంటే ఖర్చులు, బాధ్యతలు, ఆహ్వానాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ పెళ్లి చేసుకోకుండానే పెళ్లి సందడిని ఆస్వాదించాలంటే? హైదరాబాద్‌లో యువతకు ఇప్పుడు ‘ఫేక్ వెడ్డింగ్’ పార్టీలు కొత్త ఆప్షన్‌గా మారుతున్నాయి. వధువు లేదు.. వరుడు లేడు.. అసలు పెళ్లే లేదు. కానీ బారాత్, సంగీత్, మెహందీ, హల్దీ, దోల్, మాక్ వరమాల వంటి కార్యక్రమాలతో అచ్చం పెళ్లి వాతావరణాన్ని తలపించేలా ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు.


హైదరాబాద్‌లో 2023 ప్రాంతంలో ప్రారంభమైనట్లు చెబుతున్న ఈ తరహా ఫేక్ వెడ్డింగ్ పార్టీలు ప్రస్తుతం యువతలో ట్రెండ్‌గా మారుతున్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని క్లబ్‌లు, ఈవెంట్ వేదికల్లో ఇలాంటి కార్యక్రమాలకు యువత ఆసక్తి చూపుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

సంప్రదాయ దుస్తుల్లో.. ఫుల్ ఎంజాయ్

ఈ పార్టీలకు యువత లెహంగాలు, షేర్వాణీలు, ఇతర సంప్రదాయ దుస్తులు ధరించి హాజరవుతున్నారు. మెహందీ, హల్దీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పెళ్లి సందడిని ఆస్వాదిస్తున్నారు. అతిథులను పెళ్లికూతురు, పెళ్లికొడుకు వర్గాలుగా విభజించి సరదాగా బారాత్ నిర్వహిస్తున్నారు. ఇద్దరు పాల్గొనేవారిని వధూవరులుగా ఎంపిక చేసి మాక్ వరమాల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

డీజే నైట్, బాలీవుడ్, పంజాబీ పాటలు, లైవ్ దోల్, సంగీత్ ప్రదర్శనలు, డ్యాన్స్ పోటీలు, ఫుడ్ కౌంటర్లు ఈ పార్టీల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెడ్డింగ్ డెకరేషన్, ఫొటో బూత్‌లతో పాటు సంప్రదాయ దుస్తుల్లో రీల్స్, ఫొటోలు తీసుకునేందుకు యువత ఆసక్తి చూపుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ తరహా పార్టీలకు మంచి స్పందన కనిపిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

500 మందికి పైగా పాల్గొన్న ఈవెంట్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్వహించిన ఓ ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్‌కు 500 మందికి పైగా యువత హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎలాంటి అసలు వివాహ తంతు ఉండదు. కేవలం పెళ్లి వాతావరణాన్ని సృష్టించి వినోదం కోసం కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఈ పార్టీలకు ఒక్కరికి టికెట్ ధర సాధారణంగా రూ.500 నుంచి రూ.3,000 వరకు, కపుల్స్ ప్యాకేజీలు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు ఉంటున్నాయి.

సెప్టెంబర్ 26న నెక్లెస్ రోడ్‌లో భారీ ఈవెంట్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో సెప్టెంబర్ 26న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మరో ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు రూ.1,499 నుంచి రూ.9,999 వరకు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌కు 3 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

తక్కువ ఖర్చుతో.. భారీ ఆదాయం?

మధ్యస్థాయి ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహణకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. టికెట్ విక్రయాలు, ఫుడ్, బార్ సేల్స్ ద్వారా ఆదాయం రూ.10 లక్షల వరకు చేరే అవకాశం ఉందని ఈవెంట్ రంగానికి చెందినవారు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. పెళ్లి బంధం వద్దు.. కానీ పెళ్లి సందడి మాత్రం కావాలి అనే యువత ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ హైదరాబాద్ నైట్‌లైఫ్, ఈవెంట్ కల్చర్‌లో ఆసక్తికరమైన కొత్త అధ్యాయంగా మారుతోంది.