ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ఒంగోలు (ఎన్ టుడే న్యూస్): ప్రకాశం జిల్లా పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదినం సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు తాతపూడి శ్యామ్, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు వంగలపూడి రంగారావు, సంఘం సభ్యులు ముప్పూరి ఏడుకొండలు, ఆండ్ర మనోహర్ తదితరులు ఒంగోలులోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి మాగుంట శ్రీనివాసులరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.