నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్
- స్పెషల్ ఫోర్స్‌తో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్
- అనుమతి ఉన్నవారికే నామినేషన్ కేంద్రాల్లోకి ప్రవేశం
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నరసరావుపేట, పల్నాడు జిల్లా | ఎన్ టుడే న్యూస్: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో నరసరావుపేటలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ స్పెషల్ ఫోర్స్‌తో కలిసి నామినేషన్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత, ప్రవేశ నియంత్రణ, పోలీసు బందోబస్తును తనిఖీ చేశారు. అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే కార్యాలయాల్లోకి ప్రవేశం కల్పిస్తామని, అపరిచిత వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా పెంచినట్లు తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.