BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 16 October 2026, 08:25 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో బార్ల లైసెన్సులకు భారీ పోటీ..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Oct, 2026 - 08:25 PM
11 వీక్షణలు

ఒక్కో బార్‌కు సగటున 304 దరఖాస్తులు

తెలంగాణ వ్యాప్తంగా 41 బార్లకు 8,770 దరఖాస్తులు.. నార్సింగిలో లాటరీ నిర్వహణ

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త బార్‌ లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 41 బార్లకు మొత్తం 8,770 దరఖాస్తులు అందాయి. వీటిలో హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (CURE) పరిధిలోని 14 బార్లకు 4,251 దరఖాస్తులు రావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ లెక్కన ఒక్కో బార్‌కు సగటున 304 దరఖాస్తులు వచ్చాయి.

శుక్రవారం నార్సింగిలోని ది అడ్రస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఎక్సైజ్‌ కమిషనర్‌ సి. హరికిరణ్‌ పర్యవేక్షణలో CURE పరిధిలోని బార్లకు లాటరీ నిర్వహించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుల కోసం ఎంపిక చేపట్టారు.

రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న 27 బార్లకు 4,519 దరఖాస్తులు వచ్చాయి. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీలు నిర్వహించారు.

బార్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. లాటరీలో ఎంపికైన వారికి నిబంధనల ప్రకారం బార్‌ లైసెన్సులు కేటాయించనున్నారు.