స్వర్ణకార శంఖారావం సభకు వరంగల్ నుంచి భారీ ర్యాలీ
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
వరంగల్ | ఎన్ టుడే న్యూస్: స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘స్వర్ణకార శంఖారావం’ భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సభ్యులు శనివారం వరంగల్ నుంచి తరలివెళ్లారు.
నగరంలోని విశ్వకర్మ వీధి నుంచి డప్పుచప్పుళ్ల నడుమ ర్యాలీగా బయలుదేరిన సభ్యులు హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ సరూర్‌నగర్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు వారు ప్రయాణమయ్యారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
స్వర్ణకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే జీవో ఎంఎస్ నంబర్ 272ను సవరించి అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సభలో పాల్గొంటున్నట్లు తెలిపారు.