BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 16 August 2025, 10:25 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

యాదగిరిగుట్ట పట్టణంలో భారీ ర్యాలీ

తెలంగాణ
16 Aug, 2025 - 10:25 PM
514 వీక్షణలు
ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఘనంగా గొంగిడి సునీతామహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ◆ యాదగిరిగుట్ట పట్టణంలో భారీ ర్యాలీ NTODAY NEWS: ఆలేరు నియోజకవర్గం ఆలేరు అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాలలో, మండలకేంద్రాలలో కేక్ లను కట్ చేసి పలు చోట్ల స్వచ్చంధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న గొంగిడి దంపతులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గొంగిడి దంపతులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు వేదశీర్వచనం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో గొంగిడి యూత్ ఐకాన్ భారీ ర్యాలీ.. అభిమాన నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. బోనాలు,డప్పులు,డోలు వాయిద్యాలు, టపాకాయాల మోత నినాదాల హోరు నడుమ భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.అనంతరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గొంగిడి సునిత జన్మదినం సందర్భంగా రక్త దానం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అభిమాన నాయకురాలు గొంగిడి సునిత పుట్టినరోజు సందర్భంగా ప్రాణదాతలుగా నిలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ తనపై అభిమానంతో రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube