పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ
బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, ఆయన సతీమణి పద్మ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పటాన్చెరు సర్కిల్ పరిధిలోని మున్సిపల్ బిల్ కలెక్టర్లు, సిబ్బందితో పాటు ఉస్మాన్నగర్ గ్రామ ప్రజలకు వస్త్రాలను అందజేశారు.
పండుగల వేళ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పర్స శ్యామ్ రావు తెలిపారు. ప్రజలందరూ బతుకమ్మ, విజయదశమి పండుగలను సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన దంపతులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
నూతన వస్త్రాల పంపిణీ పట్ల మున్సిపల్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పర్స శ్యామ్ రావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.